సిధ్దుయిజం…….
————
బిప్సి సమర్పించు….
ముఖ్య గమనిక: ఈ చిత్రం లోని మాటలు, పాత్రలు, ప్రదేశాలు ఏవి కల్పితాలు కావు. ఈ కథ ఓ యదార్ధ గాధ…
మాటలు: కిరణ్, నరేష్ బొజ్జ, శరత్…
దర్శకత్వం: కిరణ్, నరేష్ బొజ్జ, శరత్…
తారాగణం:
సిద్ధార్ద్ – కథానాయకుడు
కిరణ్ – ప్రధాన అర్చకులు
నరేష్ – సహాయక అర్చకులు
శరత్ – సహాయక అర్చకులు
రఘు – పిండాలు పెట్టే అర్చకులు
శ్రీనివాస శాస్త్రి – పిండాలు పెట్టే సహాయక అర్చకులు
సీతయ్య -
ప్రకాశం -
జ్యోతి – అందరిలోను పెద్ద..అందరికి గురువు
విజయ్ – కూలి రైతు
మేధాంశ్ – కాటి కాపరి…వూరి కి ముందు వున్న స్మశాణం లో వుంటూ వూరిలోకి వచ్చి పోయే వారిని పలకరించే మొదటి వ్యక్తి ఇతనే…చాలా ముసలి వాడు..ముందు మూడు తరాలు వెనక మూడు తరాలు చుసిన వ్యక్తి…
దీప్తి: ఆ వూరిలో చదువుకున్న అమ్మాయి తను ఒక్కత్త్తే…బాగా ఆలోచిస్తుంది…తెలివయిన పిల్ల..ఈ మద్య వచ్చిన ప్రపంచీకరణ వల్లే తనకు ఉద్యోగం రాలేదు అని అందరికీ చెబుతుంది.
ఇలా చెప్పుకుంటూ పొతే వూరిలో వున్న వారందరి గురించి చెప్పాలి.
పాటలు/సంగీతం: నరేష్ వంకర, కిరణ్ , సునీల్..వీరంతా బాగా చదువుకున్న వాల్లే కాని ఉద్యోగాలు మాత్రం రాలేదు…అలా అని నిరుత్సాహ పడకుండా పాటలు పాడుతూ జనాలలో విజ్ఘా+నం తో పాటు ఉల్లాసాన్ని కూడా నింపుతూ..తిరుగుతూ వుంటారు…
————————————————————–
అనగనగా ఒక “పేదల పాడు” అనే వూరు ..తమిళనాడులో వున్న తాంజావూరికి ఇరవై మైళ్ళ దూరంలో వుంది..అక్కడికి కాలినడకనే వెల్లాలి…కాని ఆ ప్రాంతం ౩౦౦ సం” క్రితం పచ్చని పైర్లతో, నిత్యం దూప నైవేద్యాలతో పూజలు చేస్తూ వుండేవారు. అక్కడ ఎవరికయినా ఏ ఆపదవచ్చినా అందరికీ ముందు గుర్తు వచ్చేది సిద్దు వాల్ల ముత్తాత గారు “శ్రీ రామయ్య” గారు. ఆయన దాన గుణానికి , మంచికి పెట్టిది పేరు. రోజులు అలా గడవ సాగాయి. ఒక నాడు పూట కూటి వాళ్ళు( రోజు ఒక వూరిలో వుంటూ అందరి క్షేమ సమాచారలు చెబుతూ వుంటారు) ఆ వూరు వచ్చారు. మాటల్లో ఆంద్రప్రదేశ్ లోని క్రిష్ట్నా జిల్లా గురించి చెబుతారు. అప్పుడు క్రిష్ట్నాజిల్లాలో కరువు ప్రళయ తాండవం చేస్తూ వుంటుంది. అది విని భరించలేని రామయ్య గారు క్రిష్ట్నాజిల్లాకు వలస వచ్చి ఇక్కడి పరిస్తుతులు చక్కదిద్దాలి అని అనుకొని క్రిష్ట్నాజిల్లాకు వచ్చేస్తారు. వారు ఇక్కడకు వచ్చిన తరువాత పరిస్తితులు చక్కబడుతాయి. క్రిష్ట్నాజిల్లా ఆంద్రప్రదేశ్ లోనే సస్యస్యామలంగా వుండే జిల్లా గా మారుతుంది.
మూడు వందల సంవత్సరాల తరువాత…
—————————-
సిద్దు పెద్దవాడయ్యాడు..ఇంజినీరింగ్ పూర్తి చేసి CTS లో Software Engineer గా నెలకు 20 వేల జీతంతో పని చెస్తున్నాదు. ఇతను తీరిక సమయంలో Free Software కోసం పని చేస్తువుంటాడు. మేమంతా ఈ ఉద్యమంలోనే పరిచయం అయ్యాము.ఈ మద్య Office లో పెద్దగా పని లేకపోవటం వల్ల ఇతను ప్రతి వారం ఇంటికి వచ్చేస్తూవుంటాడు. ఇది చూసిన వాళ్ల నాన్న మన తాతల ఊరికి వెళ్ళి చూసి రమ్మని సలహా ఇస్తారు. నాన్న మాటనే వేదంగా భావించే సిద్దు తక్షణం అన్ని సర్దుకుని పేదల పాడు కు ప్రయాణం అయ్యాడు.
ఆ వూరిలోకి సిద్దు నడుస్తూ వుండగా మేధాంశ్(కాటి కాపరి) సిద్దు ని చూడగానే బాబు గారు వస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. అక్కడ పని చేసుకుంటున్న విజయ్, విజయ్ ఎద్దులు, మేకలు, గేదెలు ఆ మాట వినగానే ఆనందంతో ఎగిరి గంతేసి వూరిలోకి పరిగెడుతూ అందరికీ చెబుతాడు. ఆ మాట విన్న మేక మొక్కకు చెప్ప్తుంది. మొక్క మురికి కాలవకు..ఆ మురికి కాలవ దోమలకు..ఆ దోమలు పందులకు…ఆ పందులు చుట్టు పక్కల వారికి అందరికీ తెలిసి పోతుంది. బాబు వూరిలో వున్న బావి దగ్గరకు వెల్లి ఓ అవ్వను మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. నీళ్ళు తాగుతున్నప్పుడు బాబు కళ్ళలో వచ్చిన తేజస్సు చూసి ఆ అవ్వ బకెట్ తన్నేస్తుంది. అందరూ వచ్చి తమ తమ కష్టాలు చెప్పుకుంటూ వుంటారు. అప్పుడు విజయ్ వచ్చి ఆ వూరి భూస్వామి చేస్తున్న దురాగతాల గురించి చెబుతాడు. అది విని బాబుకు కోపం వచ్చి శివుని వలే తాండవం చేసి చివరకు ఇంకా కోపం తగ్గక పోవటంతో తొడ కొడతాడు. ఆ దెబ్బతో ఆ వూరి భూస్వామి చని పోతాడు. అప్పుడు అంతా భాణాసంచా కాల్చుతారు. దీప్తి బాబు దగ్గరకు వచ్చి తనకు ఉద్యోగం రాకపోవటానికి ప్రపంచీకరణే కారణ మనీ…దానికి తమిళ నాడులో జయలలిత, కరుణానిధి కారణమని అర్థమయ్యేలా చెబుతుంది. అప్పుడు బాబు మళ్ళీ తొడ కొడతాడు. దీంతో వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. అప్పుడు రాష్ట్రం మొత్తం దీపావళి మళ్ళీ జరుపుకుంటారు.
అక్కడే కోవైలో మహాసభలు జరుగుతున్నాయి. ప్రకాశం మహాసభల గురించి ఏమి రాసారా అని న్యూస్ పేపర్ చూస్తే వాటి గురించి అసలు ఎక్కడా ప్రస్తావనే వుండదు. మొత్తం బాబు గురించే వుంటుంది. మొత్తం తెలుసుకొని ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి వెల్దాం అని అనుకుంటారు. వెళ్ళటానికి బయటకు వచ్చి చూస్తే రఘుశీనయ్య, , ఆంద్రప్రదేశ్ లో ఏమి చేస్తే విప్లవం తీసుకొని రావచ్చు అని ఆలోచిస్తూవుంటారు. ప్రకాశ్ కారత్ మీరు ఆలోచించింది చాలులే అక్కడ ఎవరో బాబు వచ్చారంట మెము వెల్తున్నాం మీరు వస్తే రండి అని చెప్పి వెల్లిపోతారు. వారిద్దరి వెనకే వీళ్ళుకూడా పిచ్చా పాటా మాట్లాడుకుంటూ వెల్తారు. అక్కడ బాబుని చూడటానికి అంతా క్యూ కట్టి తాంజావూరి వరకు 20మైళ్లు నిలబడి వుంటారు. ప్రకాష్ కారత్ వచ్చారు అని సమాచారం బాబుకు తెలిసి 4గంటల తరువాత రమ్మని పిలుస్తాడు. అప్పుడు ప్రకాష్ కారత్ మనసులో ఇలా అనుకుంటాడు. “నేను వస్తే మన్మొహన్ సింఘ్ లేచి నిలబడి మరీ వచ్చి తీసుకొని వెల్తాడు…కాని ఇక్కడేమో నన్ను పట్టించుకునే వాడే లేడు అని అనుకుంటాడు”. ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి లోపలకు వెల్తే రఘు, శీనయ్య , గుమ్మం వద్ద నిలబడి విని వినిపించని మాటలను వింటూ వుంటారు.
బాబు, ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి సంభాషణ:
ప్రకాశ్ కారత్,సీతారాం ఏచూరి లు వారి వారి గురించి చెప్పుకొని ఇలా మొదలు పెడతారు…
ప్రకాశ్ కారత్: మీ సిద్దాంతాలేటి???
భాబు: ఏంటి గట్టిగా మాట్లాడు..
ప్రకాశ్ కారత్: మాకు మార్క్సిసం అనే సిద్దాంతం వుంది…మీకు అలాంటిది వుందా???(భయపడుతూ)
బాబు: 2నిముషాలు ఆలోచించిన తరువాత ….”సిద్దుయిజం” అని అంటారు.
20 భారత దేశ రాజకీయ పరిస్తుతులు అన్ని చెబుతారు…
బాబు: ఇవన్ని నాకు కొత్తగా వున్నయి…మీకు ఏమి కావాలో అడగండి…
ఫ్రకాశ్ కారత్: భారత దేశం లో సోషలిస్ట్ సమాజం కావాలి అని అదుగుతాడు..
బాబు: ఒక సారి తొడకొడతాడు…దెబ్బకి మతోన్మాదులు, భూర్జువా వర్గం వాల్లు, పెద్ద పెద్ద భూస్వాములు అంతాచనిపోయి…కమ్యునిస్ట్ సమాజం వచ్చేస్తుంది. ఇంకా ఏమన్నా కావాలా???
సీతారాం ఏచూరి: ప్రపంచంలో కూడా సోషలిస్ట్ సమాజం కావాలి (మన వాడు మారిక్సిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగం చూస్తాడుచిక దృష్టి ఎక్కువ)
బాబు: ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ తొడ కొడతాడు. ఈ సారి ప్రపంచీకరణను అడ్డుపెట్టుకుని సంపాదించిన దనిక వర్గం,సామ్రాజ్యవాద దేశాల అద్యక్షులు , ప్రదాన మంత్రులు అంతా చనిపోతారు. ప్రపంచంలో కమ్యునిస్ట్ సమాజం వచ్చేస్తుంది.
బయట పెద్ద పెద్ద మాల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇవన్ని బయటనిలబడ్డ వీళ్ళిద్దరికి అర్థం కాదు.
ఇంక సెలవు అని చెప్పి బయటకు వచ్చేస్తారు…బయట రఘుఘు మీరు లోపల ఏం మాట్లాడుకున్నారో నెను వినేసాగా అని అంటాడు. ఎమి విన్నావ్ అని అడిగితే మన మహాసభలో వచ్చిన వాళ్ళందరికి సరిపడ సరుకులు ఇమ్మని అడిగారా..ఇక్కడ ఇన్ని పెట్టి వున్నాయి అని రా అంటారు. సీతారాం నవ్వు నవ్వి ప్రపంచంలో మొత్తం కమ్యునిస్టు సమాజం వచ్చేసింది ఇంక మన పని అయిపొయింది. రేపటినుంది మన పనులలోకి మనం పోయి పని చేసుకోవాలి అని చెబుతాడు.
వీళ్ళు నలుగురు నడచి వెల్తుంటే రోడ్డు మీద ఇద్దరు బాపనోల్లు ఇలా మాట్లాడుకుంటుంటారు. భాబు శ్రి మహా విష్ణువు 11 వ అవతారం అని చెప్పుకుంటుంటారు. అది విన్న సీతారాం బాగా కోపం వచ్చి పరిగెత్తుకొని బాబు దగ్గరకు వెల్లి ఇలా అనుకుంటున్నారు అని చెప్తాడు. అప్పుడు బాబు మళ్ళి తొడకొడతాడు. ఈ దెబ్బతో మూడనమ్మకాలు పొయి అంతా పదార్దం అనే బావనలోకి అందరు వచ్చేస్తారు.
అప్పటి నుండి అందరూ సిద్దుయిజం నే అనుసరిస్తూవుంటారు.. అప్పటి వరకు వున్న మార్క్సిజం , లెనినిజం అన్ని ఒక్క దెబ్బతో తూడ్చి పెట్టుకు పొయాయి. ప్రజలు అంతా తమకు ఓపిక వున్నంత పని చేసి కావలసినంత ప్రటిఫలం తీసుకొని సుఖంగా వుంటారు.
కమ్యునిస్ట్ సమాజంలో ఎవ్వరూ పని చేయకుండా వుండకూడదు. అలానే సిద్దు కూడ CTS వెళ్ళి Software Engineer గా 20 వేల జీతంతో పని చేస్తువుంటాడు.
సిద్దుయిజం గురించి మరిన్ని వివరాలతో వచ్చే బాగంలో కలుద్దాం.
అంతవరకు మీ…
బొజ్జి గాడు
…